Asaduddin Owaisi: కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ముస్లిం జేఏసీ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీపై మాట్లాడిన ఒవైసీ, ప్రధాని నరేంద్ర మోడీ ముస్లింల ద్రోహి. ఆయన పాలనలో ముస్లింల పట్ల అన్యాయం ఎక్కువైందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎవరూ శాశ్వతంగా ఉండరని, రాజకీయాల్లో పెద్ద పెద్ద నేతలు కూడా వెళ్లిపోతున్నారని అన్నారు.
Read Also: PM Modi: యోగా డే సందర్బంగా విశాఖలో ప్రధాని మోడీ పర్యటన..!
మరోవైపు, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఒవైసీ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు అంటూ ఆరోపణలు గుప్పించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాట్లాడుతూ, పవన్ హీరో అయితే నేను అతని కంటే పెద్ద హీరో అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధికి తాము కూడా మద్దతుగా ఉంటామని స్పష్టం చేసిన ఒవైసీ, అమరావతి అభివృద్ధి కోసం మేమూ పోరాడతాం అన్నారు. అయితే లోకేష్ రాజకీయ ఎదుగుదలకి చంద్రబాబే అడ్డుగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
Read Also: UPSC Recruitment 2025: యూపీఎస్సీలో 462 జాబ్స్.. ఈ జాబ్స్ కొడితే మీ లైఫ్ సెట్.. మీరూ ట్రై చేయండి
అయితే, వైఎస్సార్సీపీ పై సానుకూలంగా స్పందించిన ఆయన, మాకు పార్లమెంట్‌లో జగన్ మోహన్ రెడ్డి ఎంపీలు మద్దతు ఇచ్చారన్నారు. టీటీడీలో అన్యమతస్తుడిని తీసుకోకూడదని చట్టం తేవడం ఏ మేరకు సమంజసమో అని ప్రశ్నించిన ఒవైసీ, అదే తరహాలో వక్ఫ్ బోర్డులో మాత్రం అన్యమతస్తుడిని ఎలా అనుమతించాలంటారని మండిపడ్డారు. ఒవైసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ముగ్గురి కీలక నేతలపై విరుచుకుపడటం, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాట్ టాపిక్‌గా నిలిచింది.