శ్రీశైలంలో నేడు మూడో రోజు శ్రీమల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది. ఈ నెల 21 వరకు మల్లికార్జున స్వామి వారి స్పర్శ దర్శనం కొనసాగనుంది.
నేడు ఏపీ డీజీపీగా కె.వెంకటరాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవల ఏపీ డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఎపీపీఎస్సీకి చైర్మన్‌గా బదిలీ చేసిన విషయం తెలిసిందే.
నేడు ఇండోర్‌లో గోబర్ దాన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.
నేడు గుజరాత్‌లో హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. సూరత్, బీజాపూర్‌లో అమిత్‌షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బాజీపురలో మెగా కోఆపరేటివ్ సమావేశానికి కూడా అమిత్ షా హజరుకానున్నారు.
నేడు తమిళనాడులో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ కుంభమేళ మేడారం జాతర నేటితో ముగియనుంది. సాయంత్రం సమ్మక్క-సారక్క అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నారు.
నేడు మేడ్చల్‌లో పోక్సో కోర్టు ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ పోక్సో కోర్టుల సాయంత్రం 5 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రారంభించనున్నారు.
నేడు ముచ్చింతల్‌లో శాంతికల్యాణం నిర్వహించనున్నారు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో 108 క్షేత్రాల భగవన్మూర్తుల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
నేడు కడప, విశాఖపట్నం జిల్లాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఉదయం కడపలో ఐ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం విశాఖకు సీఎం జగన్ చేరుకుంటారు. నేవల్ ఎయిర్‌స్టేషన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్న నేపథ్యంలో ఆయన సీఎం జగన్ స్వాగతం పలుకనున్నారు.