ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉన్నారు సీఎం కేసీఆర్. జ్వరం కారణంగా హాజరుకాలేదని పార్టీ, ప్రభుత్వ వర్గాలు తెలిపినా దీని వెనుక కారణాలు వున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొంతకాలంగా ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించి విఫలమవుతున్న సీఎం కేసీఆర్.. ఈ పర్యటన సందర్బంగా మోదీతో ఈ రకంగా వ్యవహరిస్తారించారని అంటున్నారు. మోడీ పేరు చెబితే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని సెటైర్లు వేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ప్రధానికి స్వాగతం పలికేందుకు సీఎం…
హైదరాబాద్ ముచ్చింతల్ లో సమతా స్ఫూర్తి విగ్రహం కనుల పండువగా ఆవిష్కారం అయింది. సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ ఆహార్యం చూపరుల్ని విశేషంగా ఆకర్షించింది. యాగంలో పాల్గొనేందుకు వీలుగా వస్త్రధారణతో.. విష్ణునామాలు పెట్టుకుని విచ్చేశారు. బంగారు వర్ణపు పంచె ధరించి విష్వక్సేనేష్టి యాగానికి హాజరయ్యారు. ఉజ్జీవన సోపాన వేదిక నుంచి లేజర్ షో వీక్షించే వేదిక వరకు నడుచుకుంటూ వచ్చారు. సభ ముగిశాక ఉజ్జీవన సోపానంపై నుంచి 108 మెట్లు దిగి కిందికి వచ్చారు. భారతదేశ…
ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు జ్వరం కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. కేసీఆర్కు జ్వరంగా ఉందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే సాయంత్రం ముచ్చింతల్లో జరిగే రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. Read Also: చలితో…
ఇవాళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్, ముచ్చింతల్ల్లో జరిగే కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే పాల్గొంటారని వివరించాయి.…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవతి.. సింగరేణి సంస్థ మూసివేతకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించిన ఆమె.. బొగ్గు గని కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతానికి వెలుగులు పంచుతోన్న సంస్థ సింగరేణి అని పేర్కొన్నారు.. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోందని విమర్శించారు.. బీజేపీ వైఖరి సమాఖ్య స్పూర్తికి…
ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 డ్యాష్ బోర్డులో ప్రస్తావించిన అంశం ఒకటి వివాదానికి ఆజ్యం పోస్తోంది. జమ్మూకాశ్మీర్ ని డబ్ల్యుహెచ్ వో డ్యాష్ బోర్డులో చైనా పాకిస్తాన్ లోని భాగంగా ప్రపంచ మ్యాప్ లో చూపించడం ఈ వివాదానికి కారణం అయింది. భారత్ లో అంతర్భాగమయిన కాశ్మీర్ ని ప్రపంచ ఆరోగ్యసంస్థ అలా చూపించడంపై టీఎంసీ ఎంపీ డా.శంతాను సేన్ తీవ్రంగా స్పందించారు. దీనిపై ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. ఈ మ్యాప్ లో…
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన తర్వాత క్రమంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్) రూల్స్- 1954 కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి.. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోడికి లేఖలు కూడా రాశారు.. మధ్యప్రదేశ్,…