బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో వేదిక కూడా ఖరారు చేశారు. జూలై 2,3 తేదీల్లో కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా అగ్రనేతలందరూ హాజరుకానున్నారు. ఇప్పటికే కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ నేతలకు ఆదేశాలు అందాయి. వచ్చే ఎన్నికలను ప్రభావితం…
రాజమండ్రిలో జరిగిన గోదావరి గర్జన సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఢిల్లీ నుంచి చాలా అబద్ధాలను పోగేసుకుని వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై జేపీ నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఈడీ, ఐటీ దాడులతో…
ఢిల్లీలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఒక్కో కార్పొరేటర్ ను పరిచయం చేసుకున్నారు ప్రధాని. 47 మంది కార్పొరేటర్లు తెలంగాణ ఎమ్మెల్యే స్థాయిలో పోరాటం చేయాలని సూచించారు మోదీ. వచ్చే ఎన్నికల కోసం బాగా పని చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. ఒక్కో కార్పొరేటర్ తో మాట్లాడుతూ.. వారి కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. కార్పొరేటర్లుగా పనితీరు ఎలా ఉందని…
2016 నవంబర్ 8న డీమోనిటైజేషన్తో కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు కొత్త నాణేల శ్రేణిని ఆవిష్కరించారు. అంధులు సైతం వీటిని సులభంగా గుర్తించేలా రూపొందించారు. ఇదే ఈ నాణేల ప్రత్యేకత! ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ఈ నాణేల ప్రత్యేక సిరీస్ను మోదీ విడుదల చేశారు. రూ. 1, రూ. 2, 5, 10, రూ. 20 డినామినేషన్లలో ఉండే ఈ నాణేలపై ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’…
1. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు మార్కుల రూపంలో ప్రకటించనున్న విద్యాశాఖ. 2. ఢిల్లీలో నేడు విజ్ఞాన్ భవన్లో ఐకానిక్ వీక్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి. 3. నేడు తెలంగాణలో టెట్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. జూన్ 12న టీఎస్ టెట్ 2022 పరీక్ష జరుగనుంది. 4. అమ్నీషియా పబ్ అత్యాచారం కేసులో…
మోడీ ప్రధానిగా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేయడం దేశం గర్వించదగ్గ విషయమని ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు దేశ రక్షణ కోసం మోడీ చేసిన కృషి అద్భుతమని ఆయన వ్యాఖ్యానించారు. మన వైపు చూడాలంటే నే పాకిస్తాన్ భయపడే స్థితికి మోడీ తీసుకు వచ్చారని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్యంలో జనరిక్ మందుల ద్వారా తక్కువ ధరకు నాణ్య మైన…
బీజేపీ అధిష్టానం తెలంగాణ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. వచ్చే నెలలో జరగబోయే బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని ఇందుకు అనుకూలంగా మార్చుకోనున్నాయి. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ లోపే మరింతగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశాలు ఎందుకు అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా వివరించాలని హైకమాండ్ ఆదేశించింది. సమావేశాల గురించి ప్రతీ బూత్ స్థాయిలో తెలిసే విధంగా…
ప్రతీ రాష్ట్రం అభివృద్ధి మేము కట్టుబడి ఉన్నామని.. రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోదీ సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ చరిత్ర పోరాటాలతో నిండి ఉందని.. తెలంగాణ ఏర్పాటు కోసం యువత ఏళ్ల తరబడి పోరాడి త్యాగాలు చేశారని ఆయన అన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా జూన్, 2014న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణకు ఏం నిధులు ఇవ్వలేదని…
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర…
కొందరు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఐటీ మంత్రి చైనాను పొగుతున్నారని.. అక్కడ ఉన్నది మిలిటరీ రూల్ అని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే ఊరుకోరని అన్నారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలు కూడా చైనా చెప్పదని.. చైనా ప్రభుత్వం చెప్పిందే రాసుకోవాలని తెలిపారు. కేటీఆర్ గొప్పగా చెబుతున్న చైనాలో ముస్లింలను చంపుతున్నారని.. అక్కడి ప్రభుత్వానికి…