బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో గత రెండు రోజులగా హైదరాబాద్ నగరం బీజేపీ జెండాలతో కాషాయమయంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే నేడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు హాజరయ్యారు. అయితే గత మోడీతో బీజేపీ అధిష్టానం మొత్తం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ నేతలు పలు ప్రశ్నలు గుప్పించారు. వాటికి సమాధానం చెప్పాలన్నారు. అయితే అలాంటిదేమి లేకుండా సభ నిర్వహించారు బీజేపీ శ్రేణులు. దీనిపై తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ.. డబుల్ ఇంజిన్ వస్తుంది అది కేసీఆర్ నేతృత్వంలో అని.. మోడీ మాటల్లో అన్ని అబద్ధాలే అంటూ విమర్శించారు. రోడ్లకు నిధులిచ్చింది లేదు..విధులిచ్చింది లేదంటూ మండిపడ్డారు. సిగ్నల్ ఫ్రీ సహచర మంత్రి కేటీఆర్ చొరవతోటే అని, సిగ్నల్ ఫ్రీ ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఆయన వెల్లడించారు.
అమలు పరిచిన ఘనత మంత్రి కేటీఆర్‌దని, ఇప్పటికే 46 చోట్ల సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అమలులో ఉందన్నారు. ఇందులో కేంద్రం పాత్ర ఉందనడం అబద్దమేనన్నారు. 50 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కంటే ఉత్తరప్రదేశ్ మూడింతలు పెద్దదని, మధ్యప్రదేశ్ రెండింతలు పెద్దదని, అక్కడ ప్రభుత్వాలు సంక్షేమ రంగానికి ఖర్చు పెడుతుంది ఎంత ? అని ఆయన ప్రశ్నించారు. 2014 కు ముందు వెనుక అన్నది అధ్యయనం చేస్తేనే అభివృద్ధి గురించి తెలుస్తోందని, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకలు అని ఆయన తెలిపారు. ఆ విజయాల వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఉందని ఆయన కొనియాడారు.