UP CM Yogi Adityanath Speech at BJP Vijaya Sankalpa Sabha
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సహా ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగిశాయి. అయితే ఈ నేపథ్యంలోనే పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు హాజరైన అతిరథమహారథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ మాట్లాడుతూ..
రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ పరం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. గతంలో జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఉత్సాహం చూపారని, తెలంగాణలో బీజేపీ నేతల ఉత్సాహం చూస్తుంటేనే త్వరలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
Bandi Sanjay : గడీ పాలనను బద్దలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి చేస్తాం
డబుల్ ఇంజన్ సర్కార్ యూపీలో వచ్చిందన్నా యోగి ఆదిత్యనాథ్.. కార్యకర్తల ఉత్సాహం మాకు ఉత్సాహానిస్తోందన్నారు. తెలంగాణలో కమల వికాసం ఖాయమని, ఎలాంటి సందేహం లేదన్నారు. తెలంగాణలో కేంద్రం పథకాలు అమలు కావడం లేదని, అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతోందని, బీజేపీ బలం ఏంటో చూపిద్దామన్నారు. జై హింద్.. జైజై శ్రీరాం అంటూ ప్రసంగం ముగించారు యూపీ సీఎం యోగి.