Central Home Minister Amith Shah Speech at BJP Vijaya Sankalpa Sabha.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు సహా ప్రధాని మోడీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. కేసీఆర్ కొడుకును సీఎం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా.. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మరీ రాష్ట్ర ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అందాయా..? అని ఆయన ప్రశ్నించారు అమిత్ షా. అంతేకాకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపడం లేదని, ఎంఐఎం కోసమే కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదని అమిత్ షా ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే.. విమోచన దినోత్సవాన్ని జరుపుతామని అమిత్ షా హామీ ఇచ్చారు. అదేవిధంగా మొదటి నుంచి తెలంగాణ పోరాటానికి బీజేపీ మద్దతు ఉందని తెలిపిన అమిత్ షా.. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ అసంపూర్తిగా చేసిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వెనుకబడిపోతుందని, భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.