మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏక్‌నాథ్ షిండే భేటీ కానున్నారు.
శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు పలు అంశాలపై ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగాయి. కొత్తగా నియమితులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు అమిత్ షాను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ప్రజలకు సేవ చేయడం ద్వారా మహారాష్ట్రను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని తాను నమ్ముతున్నట్లు.. అమిత్ షా ట్వీట్ చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షిండే తొలి పర్యటన కావడం విశేషం. మహారాష్ట్ర కేబినెట్‌ను రెండు దశల్లో విస్తరిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఢిల్లీలో కీలక నేతలతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
President Election 2022: హైదరాబాద్ రానున్న ద్రౌపది ముర్ము
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా, మిగిలిన మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. షిండే శిబిరంలో డజను మందికి పైగా మంత్రులను చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ ప్రభుత్వంలోని ప్రస్తుత ఎనిమిది మంది మంత్రులు షిండేతో పాటు అతని తిరుగుబాటుకు సహకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరికీ మరోసారి మంత్రి పదవులు దక్కవచ్చు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేన ఎమ్మెల్యేల బృందానికి ఏకనాథ్ షిండే నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఫలితంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంవీఏ సర్కారు మెజారిటీ కోల్పోగా.. శివసేన అధినేత థాకరే బలపరీక్షకు ముందే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం బలనిరూపణ పరీక్షలో 164-99 తేడాతో విజయం సాధించింది.