Delhi: ఢిల్లీలో మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం.. అమిత్ షాతో కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోపాటు పలు అంశాలపై ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగాయి. కొత్తగా నియమితులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు అమిత్ షాను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ప్రజలకు సేవ చేయడం ద్వారా మహారాష్ట్రను అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని తాను నమ్ముతున్నట్లు.. అమిత్ షా ట్వీట్ చేశారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏక్‌నాథ్ షిండే భేటీ కానున్నారు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్న ఆయన.. ఉదయం రాష్ట్రపతితో సమావేశం కానున్నారు.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా, మిగిలిన మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. షిండే శిబిరంలో డజను మందికి పైగా మంత్రులను చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్ధవ్ ప్రభుత్వంలోని ప్రస్తుత ఎనిమిది మంది మంత్రులు షిండేతో పాటు అతని తిరుగుబాటుకు సహకరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వారందరికీ మరోసారి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Parliament Sessions: కొవిడ్ నిబంధనల మధ్య వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు
మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేన ఎమ్మెల్యేల బృందానికి ఏకనాథ్ షిండే నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఫలితంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంవీఏ సర్కారు మెజారిటీ కోల్పోగా.. శివసేన అధినేత థాకరే బలపరీక్షకు ముందే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం బలనిరూపణ పరీక్షలో 164-99 తేడాతో విజయం సాధించింది. షిండేకు అనుకూలంగా 164 ఓట్లు పోల్ కాగా, కొత్తగా ఏర్పాటైన బీజేపీ-షిండే క్యాంపు కూటమికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి.బీజేపీకి చెందిన రాహుల్ నార్వేకర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైన మరుసటి రోజే విశ్వాస పరీక్ష జరిగింది. అనంతరం నార్వేకర్ శివసేన శాసనసభా పక్ష నేతగా షిండేను తిరిగి నియమించారు. శివసేన చీఫ్ విప్‌గా గోగావాలే నియామకమయ్యారు.
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?