ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైల్ శిక్ష విధించడం షాక్ కు గురిచేసిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అక్కడ బీజేపీ.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు.
Modi Surname Case: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో దేశంలో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు కీలక సూచనలు చేశారు.
దేశంలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతుండటంతో పరిస్థితి, ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోదీ పలు రాష్ట్రాల ప్రజలకు కొత్త సంవత్సర శుభాక్షాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల ఆనందం, శ్రేయస్సును ఆయన ఆకాంక్షించారు. వరసగా వివిధ రాష్ట్రాల సంప్రదాయ కొత్త సంవత్సరంపై ట్వీట్స్ చేశారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీ వ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు కొందరు. అయితే ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరంలో వేల సంఖ్యలో మోదీకి వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లు వెలిశాయి. ‘‘ మోదీ హటావో-దేశ్ బచావో’’ అంటూ పోస్టర్లపై రాతలు ఉన్నాయి. వీటిపై పోలీసులు 44 కేసులు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. ప్రకటనలపై అధిక వ్యయం కారణంగా ఢిల్లీ బడ్జెట్‌కు అంతకుముందు రోజు కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.
Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీల్ కుదర్చుకున్నారని, ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఆమె కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రతిష్టను కంచపరుస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. మమతా బెనర్జీ ఈడీ, సీబీఐ దాడుల నుంచి తనని తాను రక్షించుకోవాలని అనుకుంటోందని అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.