KTR Tweet: సవాల్ విసిరినా కానీ.. సైలెంట్ గా వున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR tweet even challenged Modi but did not get an answer: ప్రధాని మోడీ 8న తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ వచ్చిన మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన అనంతరం పరేఢ్ గ్రౌండ్స్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాగా.. తెలంగాణ అభివృధి గురించి ఒక్క మాట కూడా మోడీ నోట నుంచి రాలేదని బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంటే ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీ, బీజేపీ కేంద్ర మంత్రికి సవాల్ విసిరారు. 9 ఏళ్లలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిందో చెప్పాలని ట్విట్టర్ వేదికగా కోరగా ప్రధాని, బీజేపీ కేంద్ర మంత్రి నుంచి ఎటువంటి జవాబు రాలేదు.
దీంతో కేటీఆర్ నేను సవాల్ విసిరినా కానీ.. అక్కడి నుంచి నో ఆన్సర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. గత 9 ఏళ్లలో తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన ఒక రాష్ట్రము పేరు చెప్పాలని నరేంద్ర మోడీ లేదా ఏదైనా బాధ్యతగల బిజెపి కేంద్ర మంత్రిని సవాలు చేసా కానీ.. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి అసమర్థత బయటపడింది కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ 9 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందని చెబుతున్నా మోడీ జీ కి మాత్రం తెలంగాణ అభివృద్ధి కనపడక పోవడం హాస్యంగా వుందంటూ తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో ముందుకు దూసుకుపోతుందని, తెలంగాణలా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని ప్రశ్నించారు కేటీఆర్. రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Read also: Iftar Dawaat: ఎల్బీస్టేడియంకు సీఎం.. ఆ ప్రాంతాల్లో నో ఎంట్రీ
తాజాగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీకి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించిన మరుసటి రోజు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. తెలంగాణాలో ఇంత అభివృద్ది జరుగుతున్నా.. తెలంగాణ సాధించిన విజయాలను గురించి ప్రధాని ఒక్క మాట కూడా మెచ్చుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు.
I had challenged @narendramodi Ji or any responsible BJP Union Minister to name a state in India that has performed better all round than Telangana in last 9 years👇
Their reluctance/inability to respond speaks volumes https://t.co/ztynO31sGh
— KTR (@KTRBRS) April 12, 2023
తాజావార్తలు
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!