దేశ రాజధానిలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాలు సాధించినందుకు గాను బాక్సర్లు నిఖత్ జరీన్, లావ్లీనా బోర్గోహైన్‌లను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే.. ‘‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951’’లోని సెక్షన్ 8(3) ప్రకారం అనర్హత వేటు పడుతుంది. అయితే తాజాగా ఆయన తన ట్విట్టర్ బయోలో మార్పులు చేశారు. "డిస్ క్వాలిఫై ఎంపీ" అంటూ ప్రొఫైల్ లో మార్పులు చేశారు.
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం దావణగేరేలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా ఓ వ్యక్తి ప్రధాని కాన్వాయ్ దగ్గరకు పరిగెత్తుతూ వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్ణాటక హుబ్బళ్లి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఇలా ప్రధాని పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరగడం ఇది రెండోసారి. మోదీకి దగ్గరగా వెళ్లాలనుకున్న వ్యక్తని…
అమృత్ పాల్ సింగ్ కు సపోర్టుగా కెనడా, యూకే, ఆస్ట్రేలియాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు అతడికి మద్దతు తెలుపుతూ ఆందోళనలకు దిగుతున్నారు. ఇదిలా ఉంటే ఖలిస్తాన్ మద్దతుదారులు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్తాన్ జెండాను ఎగరేస్తామని బెదిరిస్తున్నారు. ముంబై నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ కు రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ రావడంతో సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఢిల్లీ స్పెషల్ సెల్…
ప్రధాని పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపపడింది. శనివారం కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది.
కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరులో కొత్త మెట్రో లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.4,249 కోట్ల వ్యయంతో నిర్మించిన 13.71 కి.మీ మేరకు వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం మెట్రో లైన్‌ను 12 స్టేషన్లతో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Rahul Gandhi: అదానీపై నా తరువాతి ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ కళ్లలో భయాన్ని చూశాను. నేను ఏ ప్రశ్న అడిగిన ఆలోచించే అడుగుతానని అన్నారు. అదానీతో మా ముఖ్యమంత్రులకు సంబంధం ఉందని తెలిస్తే జైళ్లలో వేయండి అని అన్నారు. దేశం నాకు గౌరవం, ప్రేమ ఇచ్చారని అన్నారు. ప్రధానిని కాపాడేందుకు ఈ డ్రామా జరుగుతోందని అన్నారు. నేను జైలు శిక్ష గురించి భయపడనని అన్నారు. ప్రజల్లోకి…
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం, లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై పలువురు విదేశీ ప్రజాప్రతినిధులు స్పందిస్తున్నారు. తాజాగా యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు భారత-అమెరికా సంతతి నేత రో ఖన్నా స్పందించారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరించడం గాంధీ తత్వానికి ద్రోహం చేయడమే అని, ఇది భారతీయ విలువలకు తీవ్రమైన ద్రోహం అని ట్వీట్ చేశాడు. రోఖన్నా యూఎస్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటివ్స్ లో సిలికాన్…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం ఇప్పుడు దేశవ్యా్ప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ చర్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. అదే సమయంలో పలు పార్టీల నేతలు కాంగ్రెస్ యువ నేత రాహుల్ కు మద్దతుగా నిలుస్తున్నారు.