AIIMS in Guwahati: ఈశాన్య రాష్ట్రాల మొదటి ఎయిమ్స్.. అస్సాంలో ప్రారంభించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం బిహు పండుగను జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం గౌహతి చేరుకున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సమక్షంలో ఎయిమ్స్ గువాహటిని ప్రధాని ప్రారంభించారు. ఎయిమ్స్ క్యాంపస్‌ను రూ.1,123 కోట్లతో నిర్మించారు. మొత్తం ఈశాన్య ప్రాంతంలో ఎయిమ్స్ ఉంది ఇది ఒక్కడటే. ఈ భవనానికి 2017లో ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారు. నల్బారి, నాగోన్, కోక్రాఝర్‌లలో మూడు వైద్య కళాశాలలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.
అంతకుముందు.. సీఎం హిమంత బిస్వా శర్మ లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. బిహును జరుపుకోవడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను అంటూ బిస్వా శర్మ ట్వీట్ చేశారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
বʼহাগ মাথোঁ এটি ঋতু নহয়
নহয় বʼহাগ এটি মাহ
অসমীয়া জাতিৰ ই আয়ুস ৰেখা
গণ জীৱনৰ ই সাহThis immortal song by Dr Bhupen Hazarika, the Bard of Brahmaputra, echoes the sentiment of every Assamese people. I heartily welcome Hon'ble PM Shri @narendramodi Ji to Assam to celebrate Bihu. pic.twitter.com/WpVvFJ7ssS
— Himanta Biswa Sarma (@himantabiswa) April 14, 2023
వేడుకలో హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ, 1.1 కోట్ల ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. రాబోయే ఒకటిన్నర నెలల్లో ఈ సంఖ్య 3.3 కోట్లకు పెరుగుతుందని చెప్పారు.ఈ కార్డులతో లబ్ధిదారులు ఐదు లక్షల రూపాయల వరకు నగదు రహిత ఆరోగ్య సంరక్షణ వైద్య చికిత్స ప్రయోజనాలను పొందగలుగుతారని తెలిపారు.
Also Read:Kotamreddy Sridhar Reddy: సీఎం జగన్‌కు థాంక్స్ చెప్పిన కోటంరెడ్డి.. ఎందుకంటే..?
కాగా, రాష్ట్ర వసంతోత్సవం సందర్భంగా అస్సాం పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ రూ. 14,300 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను అంకితం చేస్తారు. ఐఐటి-గౌహతి , రాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారంతో అస్సాం అడ్వాన్స్‌డ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ ఇన్‌స్టిట్యూట్‌కు కూడా ప్రధాని పునాది వేస్తారు. నామ్‌రూప్‌లో మెగా 500-టిపిడి మిథనాల్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. గౌహతి హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా జరిగే కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు.
తాజావార్తలు
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
-
Hide & Silk: సుహాస్ కొత్త సినిమా టైటిల్ ఇదే!
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!