PM Narendra Modi: ప్రధాని మోదీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచ దిగ్గజ నాయకుల్లో ఒకరిగా ప్రశంసిస్తున్నారు. అయితే మనం శతృవుగా భావించే చైనాలో కూడా మోదీకి ఆదరణ పెరుగుతోంది. ఏకంగా మోదీకి ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. చైనా ప్రజల నుంచి ఇంతకుముందు ఏ విదేశీ నేతకు ఇంత ఆదరణ రాలేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉన్నా.. చైనా ప్రజలు మాత్రం మోదీని అసాధారణ నేతగా పరిగణిస్తున్నారు.
దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలకోపన్యాసం చేస్తూ.. భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోందని అన్నారు.
PM Narendra Modi: భారతదేశ ప్రజాస్వామ్య విజయం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొంతమందిని బాధిస్తోందని, అందుకు వారు ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ శనివారం అన్నారు. ఇటీవల ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం ఆత్మ విశ్వాసం, సంకల్పంతో ముందుకు వెళ్తూ, ప్రపంచంలోని మేధావులు భారత్ పట్ల ఆశాజనకంగా ఉండే సమయంలో కొందరు నిరాశవాదం, దేశాన్ని తక్కువ చేసేలా, దేశ నైతికత దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఆయన…
Expressway: ఆరు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వే భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయింది.
అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర విందుకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని సమాచారం. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్-అమెరికా మధ్య బలపడుతున్న బంధానికి ఈ విందు ఓ కీలక సంకేతంగా నిలవనుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి హస్తిన చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు మోదీతో జగన్ భేటీ అవుతారు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హీరోగా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం, అందుకోసం వెళ్లిన చరణ్ పైనే హాలీవుడ్ కన్ను ఉండడం తెలిసిందే.
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఇరు పార్టీలు పోటాపోటీగా ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఈ ఏడాదిలో ఆరుసార్లు కర్ణాటకలో పర్యటించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్రమంత్రి అమిత్ షా కర్ణాటకలో…