Congress: కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బీజేపీపై వంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని ‘‘ నాటు నాటు’’ పాటకు ‘‘ ది ఎలిఫెంట్ విస్పరర్స్’’ డాక్యుమెంటరీలకు ఆస్కార్ అవార్డులు రావడాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. మేము చాలా గర్వంగా ఉన్నాము.. అయితే నా ఏకైక అభ్యర్థన ఏంటంటే బీజేపీ ఈ అవార్డులు తన ఘనత అని చెప్పుకోవద్దని ఖర్గే అన్నారు.
శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 16 మంది జాలర్లు, 102 మత్స్యకార బోట్లను త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన దౌత్యపరమైన చర్యలను ప్రారంభించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
95వ అకాడెమీ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను గెలుచుకున్న 'నాటు నాటు' వైరల్ సాంగ్ కోసం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గ్లోబల్ హిట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
భారతదేశంలో ప్రజాస్వామ్యంపై తాను చేసిన వ్యాఖ్యలు కర్ణాటక, భారతదేశం, దేవుడిపై దాడి అని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మండిపడ్డారు. లండన్ నేలపై భారత ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం అని కర్ణాటక పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.
బండి సంజయ్ ఏం చదువుకున్నారో మాకు తెలియదు సెన్సేషన్ కోసమో, వార్తల కోసమో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని, దానిని ఖండిస్తే మేం బీఆర్ఎస్ కు సపోర్ట్ అంటారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
Gujarat passes resolution On BBC Documentary on Modi: బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్(బీబీసీ) ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీ ‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ దేశంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఇటు భారత్ లోనూ.. అటు బ్రిటన్ లోనూ ఈ డాక్యుమెంటరీపై విమర్శలు రావడంతో పాటు పలువురు సమర్థించారు. భారత దేశం ఏకంగా దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న నరేంద్రమోదీ ప్రమేయం…
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణను హాజరవుతున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
వాణిజ్యం, పెట్టుబడులతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే మార్గాలను అన్వేషించడానికి జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా మార్చి 20, 21 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు.
మాఫియాను నడిపినట్లుగా మీడియాను నడుపుతున్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులు, మీడియా సంస్థలంటే మాకు గౌరవం ఉందని కేటీఆర్ అన్నారు.