Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది.
ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో 'మోదీ హటావో, దేశ్ బచావో' పోస్టర్లను వేసిన కొద్ది రోజుల తర్వాత మరో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సారి దేశవ్యాప్తంగా ఆ ప్రచారాన్ని కొనసాగించనుంది.
సీబీఐ-ఈడీ దాడులు అవినీతిపరులందరినీ ఒకే రాజకీయ పార్టీలోకి తీసుకొచ్చాయని, కేంద్రంలో బీజేపీ పాలన ముగియగానే దేశం అవినీతి రహితంగా మారుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఆరోపించారు.
Rajeev Gowda: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. మే 10న పోలింగ్ జరగనుండగా.. 13వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.. అయితే, కర్ణాటక నుంచే బీజేపీ ఓటమి ప్రారంభం అవుతుందంటున్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ గౌడ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. బీజేపీ ఓటమి ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. 2024 ఎన్నికల తరువాత కాంగ్రెస్ విజయం ఖాయం.. మాజీ ప్రధానిగా మోడీ మారడం…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
PM Narendra Modi: బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ సంస్థ నుంచి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగేందుకు పార్టీ కార్యకర్తల అంకితభావం, త్యాగాలే కారణం అని ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణలో ఉన్న పలు రాజకీయ పార్టీ మధ్య బీజేపీ మాత్రమే పాన్ ఇండియా పార్టీ అని అభివర్ణించారు. బీజేపీ అత్యంత భవిష్యత్ వాద…
PM Modi: బీజేపీ ఎక్కువ ఎన్నికల్లో గెలిస్తే, ప్రతిపక్షాల నుంచి మరిన్ని నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నుంచి ఏప్రిల్ 14 బీఆర్ అంబేద్కర్ జయంత్రి మధ్య సామాజిక న్యాయ వార్షికోత్సవం కోసం సమాయన్ని కేటాయించాలని ఎంపీలను ప్రధాని కోరారు. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టి 9 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి…
Modi posters: నగరంలోని ఉప్పల్-నారపల్లి వద్ద మోడీ వాల్ పోస్టర్లు కలకలం రేగాయి. మోడీ గారు ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు అంటూ పీఎం మోడీ వాల్‌పోస్టర్ దర్శనం ఇచ్చాయి. 2018 మే 05న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. అయితే ఇప్పటికి 5ఏండ్లు పూర్తి అవతున్న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ 40 శాంత కూడా పూర్తీ కాలేదని పోస్టల్ లో ముంద్రిచారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ప్లైఓవర్ పిల్లర్లకు…
నమీబియా నుంచి భారత్‌కు తరలించిన ఎనిమిది చిరుతల్లో ఒకటి జనవరి నుంచి కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ సోమవారం మరణించింది. సాషా రోజువారీ పర్యవేక్షణ తనిఖీలో అలసట, బలహీనంగా ఉన్నట్లు కనిపించేందు. వైద్య పరీక్షల్లో చిరుత డీహైడ్రేషన్‌కు గురైందని, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది.