PM Modi: 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 91 ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్‌లను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.”రేడియో, ఎఫ్ఎం విషయానికి వస్తే, దానితో నాకు ఉన్న సంబంధం ఉద్వేగభరితమైన శ్రోతతో పాటు హోస్ట్‌గా ఉంటుంది” అని ప్రధాన మంత్రి అన్నారు. ఆల్ ఇండియో ఎఫ్‌ఎంకు చెందిన 91 ట్రాన్స్‌మిటర్‌ల ప్రారంభం దేశంలోని 85 జిల్లాల్లోని 2 కోట్ల మంది ప్రజలకు బహుమతి లాంటిదని ప్రధాని మోదీ చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఇది చారిత్రాత్మక చర్య. వినోదం, క్రీడలు, వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులకు చేరవేయడంలో ఇది ఎంతగానో దోహదపడుతుందని.. మన్ కీ బాత్‌కు ఆదరణ పెరిగిందన్నారు. .ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 84 జిల్లాల్లో 91 కొత్త 100 వాట్ల ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్‌లను అమర్చారు. ఈ విస్తరణ ప్రత్యేక దృష్టి సరిహద్దు ప్రాంతాల్లో కవరేజీని పెంపొందించడంపై ఉంది.
Read Also: Corona Cases: దేశంలో కాస్త తగ్గిన కరోనా కేసులు
బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లడఖ్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ఎఫ్‌ఎం ట్రాన్స్‌మిటర్‌లను అమర్చినట్లు ప్రధాని కార్యాలయం పేర్కొంది. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి ప్రధాన మంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఇది ఇప్పుడు దాని మైలురాయి 100వ ఎపిసోడ్‌కు చేరువలో ఉంది.
This is a historic move that 91 FM transmitters will be inaugurated today. This will be very helpful in transmitting information related to entertainment, sports, and farming to the local people. Mann Ki Baat increased the popularity of radio: Union Minister Anurag Thakur attends… pic.twitter.com/A3hr9AQuYi
— ANI (@ANI) April 28, 2023