Telugu Sangamam: వారణాసిలో గంగా నదీ పుష్కరాల నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సమ్మేళనం’ కాశీ తెలుగు సంగమం’ కార్యక్రమం నేడు జరగనుంది. “కాశీ తెలుగు సంగమం” పేరుతో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి పలు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ కాశీ తెలుగు సమితి అధ్యక్షులు, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పర్యవేక్షణలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వేద పండితుల ఆశీర్వచనం, వేదపారాయణం, స్తోత్ర పారాయణం, గంగా ఆరాధన, గంగా హారతి ఉన్నాయి. శ్రీ కాశీ తెలుగు సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
Read Also: Heavy Rainfall: తెలంగాణలో జిల్లాలకు ఎల్లో అలర్ట్.. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం
కాశీ తెలుగు సంగమంలో పాల్గొనే భక్తులను ఉద్దేశించి ఈ రోజు రాత్రి 7.30 గంటలకు వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. కాశీలోని మానస సరోవర్ ఘాట్ వద్ద గంగా నదీ ఆరాధన”, గంగా హారతి కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీకాశీ తెలుగు సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సంస్థ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు చెప్పారు.ఈ కార్యక్రమానికి ఆయన సమన్వయ కర్తగా ఉంటారు. గంగా తీరంలోని మానసరోవర్ ఘాట్ వద్ద ఒకే రోజు ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలతో వారణాసికి ఉన్న ప్రాచీన నాగరికతా సంబంధాలు ప్రముఖంగా చూపించేలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.