రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రతిపక్ష కూటమి ఇండియా మూడో సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. అధికారంలోకి రాకముందు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటామని బీజేపీ నేత హామీ ఇచ్చారని, కానీ అది ఏనాడూ జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీపై లాలూ యాదవ్ మండిపడ్డారు.
దేశంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యనించారు.
దాదాపు 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోడీ పట్ల అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ప్యూ రీసెర్చి సెంటర్ చేసిన సర్వే ప్రకారం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చైనా తన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది.
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రాజన్ చౌదరి సస్పెన్షన్‌ను లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ రద్దు చేసింది. బుధవారం కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరైన తర్వాత సస్పెన్షన్‌ను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.
PM Modi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ‘ మూడ్ ఆఫ్ ది నేషన్’ ఫలితాలను ప్రకటించాయి.
INDIA vs NDA: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ వంటి 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి.
Rahul Gandhi: 2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఉండనున్నారు.