Rahul Gandhi: తెలంగాణపై ప్రధాని ప్రసంగం రాష్ట్రానికి అవమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
“తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై ప్రధాని మోడీ అగౌరవపరిచే ప్రసంగం తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే” అని తెలుగులో ట్విటర్ వేదికగా పోస్ట్ చేసిన సందేశంలో రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం పార్లమెంటులో ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విభజించడం రెండు రాష్ట్రాల్లో రక్తపాతానికి దారితీసిందని ప్రధాని మోడీ దుయ్యబట్టారు. అయితే, అంతకు ముందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏపీ, తెలంగాణ విభజనపై వ్యాఖ్యనించారు. యూపీఏ హయాంలో ఈ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని.. అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని ఆయన కోనియాడారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు మూడు రాష్ట్రాల విభజన ఎంతో ప్రణాళికా బద్ధంగా చేశారని మోడీ తెలిపారు. ఆ మూడు రాష్ట్రాల విభజన టైంలో అన్ని చోట్లా సంబరాలు జరిగాయన్నారు.
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
Also Read: K. Keshava Rao: పార్లమెంట్ లో మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు.. చారిత్రక వాస్తవాల పట్ల ఆయనకున్న నిర్లక్ష్యానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనంటూ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారు.. జూన్ 2, 2014న రాష్ట్ర అవతరణ కల సాకారం చేసుకున్నారు అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ అమరులను, వారి త్యాగాలను అవహేళన చేస్తూ ప్రధాని మోడీ మాట్లాడటం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరచడమే.#PMshouldApologisetoTelangana
— Rahul Gandhi (@RahulGandhi) September 19, 2023
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!