Komatireddy Raj Gopal Reddy: మీరు లేనప్పుడే బిల్లులు ఆమోదించారు.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా ( ఎక్స్ ) బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్.. తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు, అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం.. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే తానే తెచ్చినట్టు డప్పు కొట్టుకుని జనం చెవుల్లో పూలు పెట్టేది అంటూ ఆయన రాసుకొచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మహిళల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తాము సాధించిన ఘనత లాగే చెప్పుకుంటుంది అని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: Bihar Crime: నర్సుతో డాక్టర్ అక్రమ సంబంధం.. ఆపై హత్య
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
అయితే, ఇంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్ కృషి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళా బిల్లుకు బీఆర్‌ఎస్ పూర్తి సపోర్ట్ ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని ప్రతిఒక్క మహిళ విజయమని కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని ఆమె తెలిపారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Read Also: Sapta Sagaralu Dhati Trailer: గుండెలు పిండేందుకు రెడీ అయ్యారు కాస్కోండి!
తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు, అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే తానే తెచ్చినట్టు డప్పు కొట్టుకుని జనం చెవుల్లో పూలు పెట్టేది
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) September 19, 2023
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్‌ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!