పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే. కేశవరావు అన్నారు. బిల్లుకు మేం 100 శాతం మద్దతు ఇస్తామన్నారు. గతంలో రాజ్యసభలో బిల్లు వచ్చినపుడు నేను మాట్లాడాను.. మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ ఉంది అని ఆయన పేర్కొన్నారు. 2010లో కూడా ఇదే సమస్య వచ్చింది.. కొన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేఖంగా ఉన్నాయి.. బీసీలను ఆణగదొక్కెందుకు ప్రయత్నం చేస్తున్నారు అని కేవశరావు అన్నారు. ఎక్కడయినా ఏ పార్టీ అయినా.. పెత్తనం ఉన్న చోట బీసీలను అణిచి వేస్తున్నారు అంటూ కామెంట్స్ చేశాడు.
Read Also: Cyber Crime: ఐటీ ఉద్యోగిని మోసం చేసిన నేరగాళ్లు.. రూ.71.82 లక్షలు స్వాహా
బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో బీఆర్ఎస్ పార్టీ కొంత బెటర్ అని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే. కేశవరావు అన్నారు. మహిళ బిల్లు కోసం ఎందరో ఉద్యమం చేశారు.. బీఆర్ఎస్ పార్టీ మహిళా బిల్లు కోసం కొట్లాడింది.. మహిళా నాయకురాలిగా కవిత ఉద్యమం చేస్తోంది అని ఆయన వ్యాఖ్యనించారు. బీసీలు పోరాడాలి మార్చాలి.. చెప్పిందే చెయ్యాలి అని ఆయన అన్నారు. అయితే, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు బిల్లు ఇప్పటిది కాదు.. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది అని కేశవరావు అన్నారు.
Read Also: Asian Games 2023: భారత జట్టు జెర్సీ ఫస్ట్ లుక్ రివీల్.. ఫొటో వైరల్
1996 తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదాం లేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినప్పటికి లోక్‌సభలో మాత్రం పెండింగ్ లోనే ఉండిపోయింది. ఇక, 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేబినెట్ ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడంతో పలు పార్టీలు ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నాయి.