రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని సురంగల్ గ్రామంలో ప్రధాన మంత్రి మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అధ్వర్యంలో రైతులకు, వ్యవసాయ పనిముట్లు, వృద్దులకు, వికలాంగులకు అరోగ్య పనిముట్ల పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ మాట్లడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజలు.. రెండే రెండు కోరుకుంటారని ఒకటి సొంత ఇల్లు.. రెండోది సచ్చిపోతే.. బొంద పెట్టడానికి కొంచెం జాగా కావాలని కోరుకుంటారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొమ్మిది ఏళ్లైన రాష్ట్రంలో డబుల్ బెడ్రూంలు రాలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈటెల ప్రశ్నించాడు.
Read Also: Janhvi Kapoor: చీరకట్టులో నాజుకు అందాలతో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ..ఫెస్టివ్ లుక్ వైరల్..
దేశంలో నరేంద్ర మోడీ 3.50 కోట్ల ఇళ్లను కట్టించాడని మన పక్క రాష్ట్రమైన ఏపీలో 20 లక్షల ఇల్లు కట్టించాడని సర్వేలు చెప్తున్నాయని ఈటెల రాజేందర్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చకుండా పేదల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి.. ఎన్నో ఏళ్ల నుంచి దున్నుకుంటున్న భూమిని ఈ ప్రభుత్వం గుంజుకుంటుందని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లాను గ్రీన్ హౌస్ కల్టివేటింగ్ చేస్తానని చెప్పిన కేసీఆర్ అందులో భాగంగా పాలి హౌసు నిర్మించుకొవడానికి సబ్సిడీ ఇస్తానని చెప్పి.. ఇప్పటికే పాలి హౌస్ నిర్మించుకున్న రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వలేదని ఈటెల రాజేందర్ విమర్శించారు.
Read Also: Rules Ranjan: మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తే చాలదు.. స్పీడు పెంచు కిరణ్ బ్రో
బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు, పేద రైతులకు పాలి హౌస్ నిర్మాణం కానీ, పందిరి వ్యవసాయం కానీ, కల్టివేటింగ్ చేసుకోవడానికి పనిముట్లు ట్రాక్టర్లు అందిస్తామని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ పథకాలు “సర్వరోగ నివారిణి జిందాతిలిస్మాత్” లాగా రైతులకు ఎకరాక ఐదువేల రైతుబంధు ఇచ్చి అన్ని మర్చిపోయాడని దుయ్యబట్టారు.. కేంద్ర ప్రభుత్వం సఫల్ బీమా యోజన కింద రైతులకు పంటపై బీమాను అందిస్తుందని ఆయన తెలిపారు. కేసీఆర్ ప్రతి వ్యక్తికి పెన్షన్, రైతు బీమాచ రైతు బంధులాంటి పథకాలను అందిస్తున్నామని చెబుతున్నాడు.. ఈ పథకాలకు డబ్బులు సంవత్సరానికి 25 వేల కోట్ల రూపాయలయితే ఆయన పెట్టిన బెల్టు షాపుల ద్వారా సంపాదించుకున్న పైసలు 45 వేల కోట్లు అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి కడుపు నొప్పి లేస్తే మందు గోలి దొరకదు.. కానీ గుతి గుంచితే మందు బాటిల్స్ దొరుకుతుందని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు.