భారత్‌పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా మరోసారి రుజువైంది. ఇప్పటికే సుంకాల పేరుతో భారీ బాదుడు బాదుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ వేదికగా టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందు సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
PM Modi: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం మాట్లాడారు. భారత్-ఈయూ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో సంయుక్త టెలిఫోన్ కాల్ నిర్వహించారు.
US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రి అక్కడే బస చేస్తారు.. ఇక, రేపు అనగా శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్.. యోగాంధ్ర నిర్వహణపై ప్రధానికి వివరించనున్నారు.. యోగాంధ్ర పై తయారు చేసిన బుక్‌ను ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్.
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్-GSTలో కీలక సంస్కరణలు చోటుచేసుకున్నాయి. సామాన్యుడికి ఊరట కలిగించే పన్ను విధానంలో పునర్వ్యవస్థీకరణకు GST కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. GSTలో ఇప్పటి వరకూ కనిష్ఠంగా 5 శాతం పన్ను, గరిష్ఠంగా 28శాతం పన్నుతో 4 స్లాబులు ఉండేవి. అయితే, 12, 28 శాతం స్లాబుల్ని తొలగించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది.
సామాన్యుడికి మేలు కలిగేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వస్తువులపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు భారీ ఊరట లభించింది.
అమెరికాపై భారతదేశమే భారీగా సుంకాలు వసూలు చేస్తోందని.. ఇది చాలా సంవత్సరాలుగా ఈ సంబంధం ఏకపక్షంగా సాగిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మంగళవారం వైట్‌హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
చనిపోయిన తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ దుర్భాషలాడిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. అయినా కూడా తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ మద్దతు పాకిస్థాన్‌కేనని అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్ తేల్చిచెప్పారు. తాము పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతో షాంఘై సహకార సంస్థలో పూర్తి సభ్వత్వ బిడ్‌ను భారత్ అడ్డుకుందని ఆరోపించారు.