PM Modi: ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసిలో శనివారం పర్యటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించిన తీరును కొనియాడారు.
PM Modi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘‘డెడ్ ఎకానమీ’’గా పొల్చారు. రష్యాతో భారత సంబంధాలను ఉద్దేశిస్తూ, రెండు దేశాలు ఆర్థిక వ్యవస్థలు చనిపోయే స్థితిలో ఉన్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
Bandi Sanjay: కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి పదవి నాకు వద్దని చెప్పలేదు, కావాలని నేను అధిష్టానాన్ని అడగలేదన్నారు. క్రమశిక్షణ గల బీజేపీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది..
దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు.. ఆ 15 సీట్లు లేకుంటే ప్రధాని పదవి మోడీకి దక్కేది కాదన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయట పెడుతాం..మా దగ్గర 100 శాతం ఆధారాలున్నాయి.. రఫేల్ డీల్ లో పీఎంవోతో పాటు NSA జోక్యం చేసుకున్నాయి.. దీనికి సంబంధించి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని రాహుల్ గాంధీ తెలియజేశారు.
Golden Shawl: రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన ప్రత్యేక నైపుణ్యంతో మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాల (సైన్యం, నౌకాదళం, వాయుసేన) చిత్రాలను బంగారు శాలువాపై నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమెరికా ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం కారణంగానే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ నిత్యం రుసరుసలాడుతూనే ఉంటున్నారు.
PM-Kisan: దేశంలోని రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ. 6,000 పెట్టుబడి సాయంగా అందిస్తుంది. దీన్ని మూడు విడతల్లో రూ. 2,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.
ప్రధాని మోడీ శనివారం వారణాసిలో పర్యటించనున్నారు. రక్షా బంధన్‌కు ముందు దేశ వ్యాప్తంగా రైతులకు బహుమతి అందించనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత కింద 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లకు పైగా నిధులు బదిలీ చేయనున్నారు.
పాకిస్థాన్‌తో అమెరికాకు వాణిజ్య డీల్ కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్థాన్ చమురు కూడా విక్రయించొచ్చని తెలిపారు. ఇక భారత్‌పై 25 శాతం సుంకం విధించినట్లు వెల్లడించారు.
జగదీప్ ధన్ఖర్.. జూలై 21 సాయంత్రం వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి. ఆరోజే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభలో ధన్ఖర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు.