ఆంధ్రప్రదేశ్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇందులో భాగంగా ఉదయం ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధానికి.. ఏపీ గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం సైనిక హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు చేరుకున్నారు. శ్రీశైలం మల్లన్న, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.. ఆ తర్వాత కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి హాజరయ్యారు ప్రధాని మోడీ.. నన్నూరు దగ్గర 450 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు..
ఓర్వకల్ టు కొప్పర్తి మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏపీ సామర్థ్యాలను విస్మరించాయి. ఇప్పుడు NDA సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ ముఖచిత్రం మారబోతోంది. నిమ్మలూరు నైట్ విజన్ పరికరాల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీ రక్షణరంగంలో కీలకపాత్ర పోషించబోతోంది. కర్నూల్‌ను డ్రోన్ హబ్‌గా మార్చాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం. ఆపరేషన్ సిందూర్‌లో మన డ్రోన్లు అద్భుతాలు సృష్టించాయి. దేశంలో రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను లేకుండా చేశాం. జీఎస్టీ భారం తగ్గించాం. -ప్రధాని మోడీ
శ్రీకాకుళం నుంచి అంగుల్ వరకు గ్యాస్ పైప్‌లైన్. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టాం. 2047 వికసిత్ భారత్ సంకల్పానికి స్వర్ణాంధ్ర ఎంతో సహకరిస్తోంది. రెండ్రోజుల క్రితం ఏపీలో గూగుల్ పెట్టుబడి ప్రకటించింది. గూగుల్ ఏఐ హబ్‌తో విశాఖ అంతర్జాతీయ కేబుల్ హబ్‌గా మారబోతోంది. దేశాభివృద్ధికి ఏపీ అభివృద్ధి అవసరం. అలాగే ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అవసరం. -ప్రధాని మోడీ
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం. ఈ 21 శతాబ్ధం భారత్‌దే. రోడ్లు, రైల్వేలతో సహా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు ఉండేవి. కనీసం కొన్ని గ్రామాల్లో కరెంట్ పోల్స్ కూడా ఉండేవి కావు. ఇప్పుడు దేశంలో కరెంట్ లేని గ్రామం లేదు. -ప్రధాని మోడీ
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరిసర్వోత్తమరావుకి శ్రద్ధాంజలి. ఏపీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో విజనరీ నాయకత్వం ఉంది. ఇక్కడ అనంతమైన అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ, అమరావతి కలిసి పనిచేస్తున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతిలో దూసుకెళ్తోంది. -ప్రధాని మోడీ
అహోబిలం నరసింహస్వామి, మహానందీశ్వరుడికి నమస్కారాలు.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైలం మల్లిఖార్జునుడిని దర్శించుకున్నాను.. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించాను-ప్రధాని నరేంద్ర మోడీ
సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే.. సరైన సమయంలో.. సరైన నాయకుడు దేశాన్ని పాలిస్తున్నారు.. ఆపరేషన్ సిందూర్‌తో మన సైనిక బలమేంటో చూపించాం.. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు ఆదా అవుతుంది-సీఎం చంద్రబాబు
ప్రధాని మోడీని కర్మయోగిగా చూస్తాం.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోడీని కర్మయోగి అంటాం.. జీఎస్టీ సంస్కరణలు చేపట్టి సామాన్యులకు రిలీఫ్ కల్పించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు పాలిస్తుంది.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడతాం-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నమో అంటే విక్టరీ, ఆయన ఏది చేపట్టినా విజయమే.. ప్రపంచ దేశాలు పన్నులు పెంచితే, మన ప్రధాని ట్యాక్స్‌లు తగ్గించారు.. దసరా, దీపావళి కలిసి వస్తే వచ్చేది సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. -మంత్రి నారా లోకేష్
కర్నూలులో సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభ జరుగుతోంది.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా.. పలువురు మంత్రులు.. ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు నన్నూరు దగ్గర 450 ఎకరాల్లో సభ ఏర్పాటు చేశారు.. రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు
కాసేపట్లో కర్నూలు సభకు ప్రధాని మోడీ.. రూ.13,429 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్న మోడీ. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ప్రధాని. మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారికి ప్రధాని ప్రత్యేక పూజలు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని మోడీ. సాయంత్రం 4:05 గంటలకు నన్నూరు దగ్గర బహిరంగ సభ.

శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
శ్రీశైలంలో పూర్తయిన ప్రధాని మోడీ పర్యటన.. శ్రీశైల మల్లన్న, భ్రమరాంబ అమ్మవార్ల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని.. అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సున్నిపెంట నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా కర్నూలుకు తిరుగుపయనమైన మోడీ. కాసేపట్లో కర్నూలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి బహిరంగసభలో పాల్గొననున్న ప్రధాని.
శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన.. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్న ప్రధాని మోడీ. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్నూలు నగరం అనుకోని ఉన్న నన్నూరు దగ్గర 400 ఎకరాల్లో ప్రధాని మోడీ బహిరంగ సభ జరగనుంది. 3 లక్షల మందితో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో బహిరంగ సభ.. రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ.. 50 ఎకరాల్లో సభా ప్రాంగణం, 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు.. జనసమీకరణకు దాదాపు 7 వేల బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు.
సైనిక హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు పయనమైన ప్రధాని మోడీ.. ప్రధాని తోపాటు శ్రీశైలానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధాని మోడీ.
ఢిల్లీ నుంచి కర్నూలు చేరుకున్న ప్రధాని మోడీ.. ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హెలికాఫ్టర్‌లో శ్రీశైలంకు బయలు దేరనున్న ప్రధాని మోడీ.
ఢిల్లీ నుంచి కర్నూలు బయల్దేరిన ప్రధాని మోడీ.. ప్రత్యేక విమానంలో కర్నూల్ కు చేరుకోనున్న ప్రధాని మోడీ.