ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేస్తున్నట్లు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు. తాజాగా ట్రంప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారని ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు.

వైట్‌హౌస్‌లో విలేకర్లతో ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ చమురును దిగుమతి చేసుకోవడంపై తాను భారత ప్రధాని మోడీ దగ్గర ఆందోళన వ్యక్తం చేశానన్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోందన్నారు. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును ఆపేయనున్నట్లు ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చినట్లు ట్రంప్ తెలిపారు. ఇదొక కీలక ముందడుగు అని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇది కూడా చదవండి: Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
ఇది కూడా చదవండి: Tejashwi Yadav Vs BJP: తేజస్వి యాదవ్‌పై సతీష్ కుమార్ పోటీ.. బ్యాగ్రౌండ్ ఇదే!