Minister Nara Lokesh: నమో అంటే విక్టరీ, ఆయన ఏది చేపట్టినా విజయమే అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు మంత్రి నారా లోకేష్.. ప్రపంచ దేశాలు పన్నులు పెంచితే, మన ప్రధాని నరేంద్ర మోడీ ట్యాక్స్‌లు తగ్గించారని గుర్తుచేశారు.. దసరా, దీపావళి పండుగలు కలిసి వస్తే వచ్చేది సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అని అభివర్ణించారు.. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పలువురు మంత్రులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ.. భారత్‌ను తిరుగులేని శక్తిగా మారుస్తున్నారన్నారు అని కొనియాడారు.
Read Also: Ravi Shastri: రోహిత్-విరాట్‌లు అప్పుడే రిటైర్ అవుతారు..
ఇక, గుజరాత్ ముఖ్యమంత్రిగా.. భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారని తెలిపారు నారా లోకేష్.. అయితే, ఆయన బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాది ఎలా కష్టపడ్డారో.. ఇప్పటికే అలాగే కష్టపడుతున్నారు. గుజరాత్‌ను శక్తిమంతమైన రాష్ట్రంగా మార్చారు అని కొనియాడారు.. కేంద్రంలో నమో (నరేంద్ర మోడీ).. రాష్ట్రంలో సీబీఎన్ (నారా చంద్రబాబు నాయుడు). ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ గా అభివర్ణించారు.. నమో సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నాం.. విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసుకున్నాం.. నమో అంటే దేశ ప్రజల నమ్మకం అని.. దేశ ప్రజలకు నమో అంటే నమ్మకం అని పేర్కొన్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానమని తెలిపారు మంత్రి నారా లోకేష్.. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..