బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఓ వైపు ప్రతిపక్ష కాంగ్రెస్.. ఓట్ల చోరీ జరుగుతుందంటూ అటు బీహార్‌లోనూ..ఇటు జాతీయంగానూ పోరాటం చేస్తోంది.
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం వెలువడుతోంది. భారీగా సుంకం విధించడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రంప్ కీలక పోస్ట్ చేశారు.
నేపాల్‌ను ఆర్మీ తన చేతుల్లోకి తీసుకుంది. అలాగే కర్ఫ్యూను కూడా కొనసాగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నాల్లో సహకరించాలని సైన్యం కోరింది.
సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రధాని మోడీ మంగళవారం హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో సహాయ శిబిరాలను పరిశీలించనున్నారు.
PM Modi: 2023లో మణిపూర్‌లో కుకీలు, మైయితీలకు మధ్య జాతి ఘర్షణలు ప్రారంభయ్యాయి. అప్పటి నుంచి ఆ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. ఘర్షణలు ప్రారంభమైన రెండేళ్ల తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్రమోడీ మణిపూర్ పర్యటనకు వెళ్లుతున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న జమ్మూకాశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ, ఇంజనీర్ రహీద్పై దాడి జరిగింది. రషీద్‌పై ట్రాన్స్‌జెండర్ ఖైదీలు దాడి చేసినట్లుగా జైలు వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్ గురించి గానీ.. మోడీ గురించి గానీ గంటకో మాట మాట్లాడుతున్నారు. అప్పటికప్పుడే విమర్శిస్తుంటారు.. అంతలోనే మాట మారుస్తూ ఉంటారు. భారత్.. అమెరికాకు దూరం అయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతలోనే మీడియా సమావేశంలో అదేమీ లేదు.. మోడీతో ఎప్పుడూ మంచి స్నేహంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
Nag Ashwin : కేంద్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో రూ.100 వరకు ఉన్న సినిమా టికెట్ల ధరలపై జీఎస్టీని తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 శాతం ఉన్న జీఎస్టీని 5శాతం వరకు తగ్గించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రధానమంత్రి మోడీకి కీలక సూచనలు చేశాడు. రూ.100లోపు ఉన్న టికెట్లపై జీఎస్టీని తగ్గించడం చాలా మంచి విషయం అని.. కాకపోతే రూ.250 వరకు ఉన్న టికెట్ ధరలపై జీఎస్టీని తగ్గిస్తే బాగుండేదని అన్నాడు.…