IIM-Visakhapatnam: నేడు IIM- విశాఖ శాశ్వత క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ, సీఎం జగన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIM Vizag Campus: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (IIMV) శాశ్వత క్యాంపస్ ప్రారంభానికి సిద్ధమైంది. నగర శివారున ఆనందపురం మండలం గంభీరంలో 436 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ క్యాంప్‌సను ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు కూడా వర్చువల్ గానే పాల్గొంటారు. ఇక, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖకు ఐఐఎంను కేటాయించింది.
Read Also: Amrit Bharat Express: త్వరలో పట్టాలెక్కనున్న 50అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
Also Read
కాగా, భవనాల నిర్మాణానికి అవసరమైన 472.61 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా.. గత టీడీపీ ప్రభుత్వం ఆనందపురం మండలంలోని గంభీరంలో 436 ఎకరాల భూమిని కేటాయించింది. శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి 2015 జనవరి 17న అప్పటి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ భూమి పూజ చేయగా.. ఈ పనులు పూర్తికావడంతో ప్రధాని మోడీ దీన్ని నేడు ప్రారంభించనున్నారు. శాశ్వత క్యాంప్‌సను 62,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దారు. దీంట్లో ఫుట్‌బాల్ గ్రౌండ్, క్రికెట్ మైదానం, ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు అనుగుణమైన సదుపాయాలు, జిమ్, యోగా, మెడిటేషన్ సెంటర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే, 1500 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానల్స్ సైతం ఏర్పాటు చేశారు. కాగా, గత తొమ్మిదేళ్ల నుంచి ఆంధ్ర వర్సిటీలోని (ఏయూ) తాత్కాలిక క్యాంప్‌సలో ఐఐఎం తరగతులను కొనసాగిస్తున్నారు. తొలి బ్యాచ్ 2015లో స్టార్ట్ అయింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!