jammu and kashmir: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ లోయలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే సంగల్దాన్ స్టేషన్ & బారాముల్లా స్టేషన్ మధ్య నడిచే తొలి ఎలక్ట్రిక్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాశ్మీర్ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు.. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీరుతాం అని చెప్పుకొచ్చారు. గత కొన్ని ఏళ్లుగా కశ్మీర్ అభివృద్దిని ఎవరూ పట్టించుకోలేదు అని మోడీ ఆరోపించారు.
Read Also: Paytm : పేటీఎం ఎఫెక్ట్.. ఫిన్ టెక్ కంపెనీల సీఈవోలతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ
ఇక, కుటుంబ రాజకీయాలు చేసేవారు.. కేవలం వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే చేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు గుప్పించారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది అని చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. మోడీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందన్నారు. కాగా, ఐఐటీ, ఐఐఎంలు ఏర్పాటు చేస్తామని చెప్పి.. చేసి చూపించాం అని ఆయన తెలిపారు. అలాగే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ కర్నూలు, ఐఐఎం విశాఖ, ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.