PM Modi: ఎన్డీఏ సీట్లపై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికలపై ప్రధాని మోడీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి (NDA) 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని యావత్మాల్‌లో పీఎం కిసాన్ నిధులు విడుదలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
పదేళ్ల క్రితం తాను ఛాయ్ పే చర్చ కోసం యావత్మాల్‌కు వచ్చినప్పుడు మీరు తనను ఆశీర్వదించారని తెలిపారు. దేశ ప్రజలు ఎన్డీయేను 300కు పైగా సీట్లలో గెలిపించారు. మళ్లీ 2019 ఫిబ్రవరిలో కూడా ఇక్కడికి వచ్చా. అప్పుడూ కూడా ఎంతో ప్రేమ చూపించారన్నారు. ఆ ఎన్నికల్లోనూ ఎన్డీయేకు 350 మార్కుదాటిందని వివరించారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఈరోజు 2024 ఎన్నికల ముందు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చినప్పుడు దేశమంతా అదే స్వరం ప్రతిధ్వనిస్తోందని తెలిపారు. ఈసారి ఎన్డీయేకు 400కు పైగా సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. గత యూపీయే ప్రభుత్వ హయాంలో దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో మీకు గుర్తుందా? అప్పట్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి మహారాష్ట్రకు చెందినవారేనని. విదర్భ రైతుల పేరిట ఢిల్లీ నుంచి ప్రకటించిన ప్యాకేజీని మధ్యలోనే తినేశారని ఆరోపించారు. రైతులు, పేదలు, గిరిజనులకు ఏమీ అందలేదని విమర్శించారు. కానీ ఈరోజు చూస్తే.. తాను ఒక బటన్‌ని నొక్కగానే పీఎం కిసాన్ నిధులు దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయని.. ఇదీ మోడీ హామీ అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!