ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. రెండో దశలో విమానాశ్రయాలు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కాబోతున్నాయి.
Burj Khalifa: ప్రధాని నరేంద్రమోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేలా ఇరు దేశాల నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యూఏఈ పర్యటన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరున్న దుబాయ్‌లోని ‘‘బుర్జ్ ఖలీఫా’’పై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ప్లే చేసింది. ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై భారత త్రివర్ణం వెలిగిపోయింది.
అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని (Hindu Temple) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. యూఏఈ చరిత్రలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం.
Qatar-India: ఖతార్ దేశంలో గూఢచర్యం ఆరోపణలతో ఉరిశిక్ష విధించబడిన 8 మంది భారత మాజీ నేవీ అధికారులు, శిక్ష నుంచి బయటపడ్డారు. ఇటీవల వారంతా భారతదేశానికి వచ్చారు. మోడీ ప్రభుత్వ హాయాంలో ఇది అతిపెద్ద దౌత్య విజయంగా భావించబడుతోంది. జలంతర్గామి నిర్మాణంలో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యానికి పాల్పడుతున్నారని చెబుతూ ఖతార్ కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వం కలుగజేసుకుని వారిని శిక్ష నుంచి తప్పించగలిగింది.
Maldives: మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Farmers Protest: తన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ, రైతులు ఢిల్లీ ముట్టడికి పిలపునిచ్చారు. పంటకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పాటు రైతులకు, రైతు కూలీలకు ఫించన్లు, లఖీంపూర్ ఖేరీ బాధితులకు ఆర్థిక సాయం వంటి పలు రకాల డిమాండ్లతో ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కి బయలుదేరారు. ఇదిలా ఉంటే, వీరిని అడ్డుకునేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించాయి. నిన్నటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్‌లను…
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను కేంద్ర సర్కార్ మరోసారి చర్చలకు పిలిచింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని రైతు సంఘాలకు సూచన చేసింది.
పేపర్ లీకుల నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారులు నిర్వహించాల్సి ఉంటుంది.