PM-KISAN: పీఎం కిసాన్‌పై కేంద్రం కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంలోకి కొత్తగా 90 లక్షల మంది లబ్ధి పొందినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు పేర్కొంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోకి (PM-KISAN scheme) 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో ఈ లబ్ధిదారులు కొత్తగా పథకంలో భాగమైనట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గతేడాది నవంబర్ 15న వికసిత్ భారత్ సంకల్ప్‌యాత్రకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2.60 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు కేంద్రం తెలిపింది.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
2019 ఫిబ్రవరి 2న కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఏటా రూ.6వేలు చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. 16వ విడత నిధులను ప్రధాని మోడీ ఇటీవల విడుదల చేశారు. 11 కోట్ల మంది ఖాతాల్లో ఈ నగదు జమైంది. పథకం ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్ల నగదు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇకపోతే ఈ కిసాన్ మిత్ర ఇప్పుడు ఇంగ్లీష్, హిందీ, ఒడియా, తమిళం, బంగ్లా, మలయాళం, గుజరాతీ, పంజాబీ, తెలుగు, మరాఠీ వంటి 10 భాషల్లో అందుబాటులో ఉంది.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!