Breaking News: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నేతలు లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.
100 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు కేరళ, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి.
Read Also: Gangster: మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, ఆర్ఎస్ఎస్ నేత హత్యలో నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్..
ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ సభ్యులు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం రాత్రి సమావేశమైంది. ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని అధికార పార్టీ చూస్తోంది. ఇండియా కూటమి ఇంకా సీట్ల షేరింగ్ గురించి చర్చలు జరుపుతున్న నేపథ్యంలో, వారిపై మరింత ఒత్తిడి పెంచే విధంగా బీజేపీ పావులు కదుపుతోంది.