BJP 1st List: లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు 34 మంది మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కూడా లోక్‌సభ బరిలో నిలిచారు.
తొలి జాబితాలో 28మంది మహిళలతో పాటు 50 ఏళ్ల లోపు 47 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓబీసీ వర్గానికి చెందిన 57 మందికి చోటు దక్కింది. మొత్తం 195 మందిలో 51 మంది ఉత్తర్ ప్రదేశ్ నుంచి, 20 మంది పశ్చిమ బెంగాల్ నుంచి, ఐదుగురు ఢిల్లీ నుంచి ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి 24 మంది, గుజరాత్ నుంచి 15 మంది, రాజస్థాన్ నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 9 మంది, కేరళ నుంచి 12 మందిని ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. అమిత్ షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి , కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్ పోర్‌బందర్ నుంచి పోటీలో ఉండనున్నారు. ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళ తిరువనంతపురం నుంచి పోటీలో దిగనున్నారు. జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ గుణ నుంచి, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి లోక్‌సభ బరిలో ఉన్నారు.
BJP releases first list of 195 candidates for Lok Sabha elections pic.twitter.com/ms1zTtzLfL
— ANI (@ANI) March 2, 2024