మోదీ 3.0 పై ధీమాలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ క్రమంలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగానే నేటి నుంచి బీజేపీ జాతీయ సమావేశాలు రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జరగనున్నాయి.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే…
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్‌కు గుజరాత్ హైకోర్టులో (Gujarat High Court) చుక్కెదురైంది. ప్రధాని మోడీ (PM Modi) విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై ఓ యూనివర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆ పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), సంజయ్ సింగ్‌లు ఇబ్బందుల్లో పడ్డారు.
PM Modi: పంటకు కనీస మద్దతు(ఎంఎస్పీ) చట్టంతో సహా 12 హామీలను అమలు చేయాలని కోరుతూ రైతులు రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ‘ఢిల్లీ ఛలో’ పేరుతో దేశ రాజధాని ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, వీరందరిని హర్యానా-ఢిల్లీ బోర్డర్లో పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. కేంద్రమంత్రులు, రైతు సంఘాల నేతలతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఆందోళన విరమణపై హామీ రాలేదు.
కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతల వల్ల దేశవ్యాప్తంగా చాలా చోట్ల గంటల కొద్దీ అంధకారం ఉండేది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కరెంట్ కొరత ఉంటే ఏ దేశం అభివృద్ది సాధించలేదు.. ఇక, కాంగ్రెస్ భవిష్యత్ గురించి ఊహించలేదు.. రోడ్డు మ్యాప్ గురించి ఆలోచించలేదు అని ప్రధాని తెలిపారు.
భారతీయ జనతా పార్టీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో కొత్తగా నిర్మించిన భారత్ మండపంలో జాతీయ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల సమావేశాల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన సుమారు 11, 500 బీజేపీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.
రాజస్తాన్‌లో ఎన్టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్ ప్రాజెక్టును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవాళ జాతికి అంకితం చేయనున్నారు. బికనీర్ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది.
ప్రధాని మోడీ (PM Modi) విదేశీ పర్యటనలు ముగించుకుని భారత్‌కు బయల్దేరారు. ఖతార్ నుంచి ఆయన ఇండియాకు పయనం అయ్యారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోనున్నారు.
ఖతార్‌లో (Qatar) ప్రధాని మోడీ (PM Modi) పర్యటించారు. గురువారం దోహాలోని అమిరి ప్యాలెస్‌లో ప్రధాని మోడీ ఘన స్వాగతం లభించింది. అనంతరం ఖతార్ అమీర్, ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ ధానీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో మోడీ సమావేశం అయ్యారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. యూఏఈ పర్యటన ముగిసిన తర్వాత ఆయన ఖతార్ వెళ్లారు. ఇటీవల ఖతార్‌లో ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, భారత్ దౌత్యమార్గాల ద్వారా ఒత్తిడి తీసుకురావడంతో ఖతార్ దిగి వచ్చి వారందర్ని విడుదల చేసింది. ప్రస్తుతం వీరంతా ఇండియా చేరుకున్నారు.