Adilabad Traffic: ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 4న ఆదిలాబాద్ లో పర్యటించన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ప్రకటించారు. ప్రధానమంత్రి భద్రత చర్యల్లో భాగంగా స్థానిక ఏరోడ్రం, పలు పరిసర ప్రాంతాలు సాధారణ ప్రజలకు నిషేధిత ప్రాంతాలుగా ఉన్నాయని అన్నారు.
Read also: TSRTC National Award: టీఎస్ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డు.. ఈనెల 15న ఢిల్లీలో..
ట్రాఫిక్ ఆంక్షలు..
* కచ్ కంటి గ్రామ ప్రజలు ఆదిలాబాద్ పట్టణానికి రావడానికి పాత సాత్నాల రహదారిని వాడుకోవాల్సిందిగా, ఎరోడ్రం లోనికి అనుమతి ఉండదని తెలిపారు.
* కె.ఆర్.కె. కాలనీ వాసులు పట్టణంలోకి రావడానికి మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు ఉన్న రోడ్డును వాడుకోవాల్సిందిగా తెలిపారు.
* అంకులి, తంతోలి గ్రామ ప్రజలు పట్టణంలోకి రావడానికి కృష్ణా నగర్ మీదుగా మావల పిఎస్ ముందు ఉన్న రోడ్డును వాడుకోవాల్సిందిగా తెలిపారు.
* ప్రధాన మంత్రి సభకు విచ్చేస్తున్న ప్రజలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్ల పార్కింగ్ ప్రదేశం వినాయక చక్నందు గల మధుర జిన్నింగ్, గౌతమ్ మోడల్ స్కూల్ పార్కింగ్ ప్రదేశాలు.
* సభకు వచ్చే బస్సులకు సంబంధించిన పార్కింగ్ ప్రదేశం స్థానిక డైట్ కళాశాల మైదానం, రామ్ లీలా మైదానం, టిటిడిసి ఎదురుగా ఉన్న ప్రదేశం.
* సభాస్థలికి వచ్చే ప్రజలు, కార్యకర్తలు తమ పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే వాహనాలను నెలపాలని సూచించారు.
Read also: Mallu Bhatti Vikramarka: మూసి రివర్ నిర్లక్ష్యం కావడం వల్లనే డ్రైనేజీగా మార్చారు..!
అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో రెండు రోజులపాటు అనగా ఆదివారం, సోమవారం ఎటువంటి డ్రోన్లు సభాస్థలి, హెలిపాడ్, పట్టణంలో ఎగురవేయడం నిషేధం అని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మార్చి 4న (సోమవారం) ఇంటర్మీడియట్ పరీక్ష సందర్భంగా అదేవిధంగా పట్టణంలో ప్రధానమంత్రి బహిరంగ సభ, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నందున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వీలైనంత త్వరగా చేరుకొని పరీక్షలను విజయవంతంగా రాయాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా ప్రజలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Kishan Reddy: బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చు..!