PM Modi in Mumbai: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 29, 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ముంబైలోని గోరేగావ్‌లోని నెస్కో ఎగ్జిబిషన్ సెంటర్‌కు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్న ప్రధాని.. అక్కడ రోడ్లు, రైల్వేలు, ఓడరేవు రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దీని తర్వాత సాయంత్రం 7 గంటలకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఐఎన్ఎస్ టవర్స్‌ను మోడీ ప్రారంభించనున్నారు.
Read Also: Off The Record: సొంత పార్టీ నేతల టార్గెట్‌లో వైసీపీ మాజీలు..!
ఇక, 16,600 కోట్ల రూపాయల వ్యయంతో థానే బొరివలి టన్నెల్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. గోరేగావ్ ములుండ్ లింక్ రోడ్ (జీఎంఎల్‌ఆర్) ప్రాజెక్టులో రూ. 6,300 కోట్లతో నిర్మించనున్న సొరంగ మార్గానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. నవీ ముంబైలో కళ్యాణ్ యార్డ్ రీమోడలింగ్, గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌కు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి యువజన శిక్షణా పథకాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అవకాశాలను అందించడం ద్వారా యువత నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి ఇది ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అని పీఎంవో అధికారులు వెల్లడించారు.