దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది ప్రధాని మోడీ చారిత్రాత్మక మూడో టర్మ్‌లో మొదటి ప్రసంగం కావడం విశేషం.ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయడం ఇది వరుసగా 11వ సంవత్సరం.
ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ.. మరోవైపు అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారని ఆరోపించారు.. సెబీ అనేది ఒక పవర్ ఫుల్ సంస్ధ.. అలాంటి సంస్థ కూడా అదానీకి కొమ్ముకాయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.
మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభ ఎంపీగా చేయాలని హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యుల సీట్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిని రాష్ట్రపతి త్వరలో నలుగురు సభ్యులను నామినేట్ చేస్తారని దుష్యంత్ చౌతాలా తెలిపారు. భారతదేశపు గొప్ప క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాగా, దేశ వీర కుమార్తె వినేష్ ఫోగట్‌ను కూడా రాష్ట్రపతి.. ప్రధానమంత్రి…
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. ఈ ప్రత్యేక అతిథులు 150 మంది మహిళా సర్పంచ్‌లు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో వారు అద్భుతమైన కృషి చేసినట్లు సమాచారం.
PM Modi : ఆగస్టు 11 ఆదివారం నాడు రైతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంలో రైతులకు ఆయన పెద్ద కానుకను అందించారు. ప్రధాని మోదీ పూసా ఇనిస్టిట్యూట్‌కు చేరుకున్నారు.
Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరోసారి తన నివేదికతో భారత్‌లో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. సెబీ చైర్‌పర్సర్ మధాబీ పూరి భుచ్పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే, దీనిపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు.
BJP: బంగ్లాదేశ్ అల్లర్లు, హింసను ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. భారత్‌లో కూడా ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ ఇటీవల ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో, భారత్‌లో కూడా బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు
కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. 'నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది' అని అమన్‌తో ప్రధాని అన్నారు.
Maldives: ‘‘ఇండియా అవుట్’’ నినాదంతో అధికారంలోకి వచ్చి, చైనా అనుకూల, భారత వ్యతిరేక విధానాన్ని అవలంభించిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూకి త్వరగానే తత్వం బోధపడింది.
ప్రకృతి విలయంతో వయనాడ్ కకావికలం అయింది. ఊహించని విపత్తుతో ఆప్తుల్ని కోల్పోవడంతో పాటు ఆస్తుల్ని పోగొట్టుకుని దు:ఖ సముద్రంలో ఉన్న బాధితులకు ప్రధాని మోడీ అండగా నిలిచారు. వారి కష్టాలను, బాధలను తెలుసుకుని చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.