Kolkata Doctor Case: కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని ఆగ్రహావేశాలకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కి నార్కో టెస్టు నిర్వహించాలని సీబీఐ కలకత్తా హైకోర్టుని కోరింది. సీబీఐకి అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో గత నెల నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసిన ఘటనలో కీలక నిందితుడిగా సంజయ్ రాయ్ ఉన్నాడు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Waqf board: వక్ఫ్ బోర్డు ఆగడాలు.. ప్రైవేట్, ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తుందన్న బీహార్ ఎంపీ..
నార్కో టెస్ట్ లేదా నార్కో అనాలిసిస్ అని కూడా పిలుస్తారు. ఇది హిప్నోటిక్ లేదా సెమీ-కాన్షియస్ స్థితిని ప్రేరేపించే ఔషధాన్ని అందించడం ద్వారా ఒక వ్యక్తి నుండి సమాచారాన్ని సేకరించేందుకు ఉపయోగించే ఒక రకమైన పరిశోధనాత్మక విధానం. సాధారణంగా ఇందుల్లో సోడియం పెంటోథాల్‌ని వినియోగిస్తారు. దీనిని ‘‘ట్రూత్ సీరం’’ అని కూడా పిలుస్తారు. ఈ ఔషధం వ్యక్తి యొక్క స్పృహని తగ్గిస్తుంది. వారు మరింత స్వేచ్ఛగా, నిరోధం లేకుండా మాట్లాడటానికి వీలు కల్పిస్తుంది. పరిశోధకులు నిందితుడి నుంచి నిజాలు రాబట్టడం సులువు అవుతుంది.
గత వారం కోల్‌కతా కోర్టు నిందితుడి బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. అతడి జ్యుడిషీయల్ కస్టడీని సెప్టెంబర్ 20 వరకు పొడగించింది. గురువారం సంజయ్ రాయ్ దంత ముద్రలు, లాలాజల నమూనాలను సీబీఐ సేకరించింది. నేరంలో అతడి ప్రయేమయం గురించి స్పష్టత పొందడానికి డాక్టర్ శరీరంపై కనిపించిన కొరికిన గుర్తులతో వీటిని పోల్చి చూస్తారు. వైద్యురాలి శరీరంపై ఫోరెన్సిక్ నిపుణులు అనేక పళ్లతో కొరికిన గాయాలను గుర్తించారు. సాక్ష్యాలు పరిశీలించడం కోసం సీబీఐ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ(CFSL) సహాయం తీసుకుంటోంది.