PM Modi-Putin telephonic call: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల జరిగిన ఉక్రెయిన్ పర్యటనపై ఇరు నేతలు చర్చించారు.
PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. ఇటీవల, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాలపై మోడీతో జో బైడెన్ చర్చించారు.
జమ్మూకశ్మీర్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించనున్నారు. కాగా.. బీజేపీ విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్లలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
CPI Naryana: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసారు. సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేష్.. శ్రీనివాస్ రావులు రాష్ట్ర సహా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పశ్య పద్య జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలని.. హైడ్రా చర్యల వల్ల బడా బాబులు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా.. వాళ్ళ ఒత్తిడితో రేవంత్…
Ladakh 5New Districts : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని 50కి పైగా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ తీపి కబురు అందించింది. సీపీఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) అమలు చేయాలని నిర్ణయించింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుంది. కేంద్రం ఈ నిర్ణయంతో వీరంతా యూపీఎస్ పరిధిలోకి రానున్నారు.
PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం.
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా బీజేపీ చేయాలనుకుంటుందని అసదుద్దీన్ మండిపడ్డారు. ఈరోజు దారుస్సలాంలో ఎంపీ…
కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS) పథకం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక 'X'లో తెలిపారు. 'ఏకీకృత పెన్షన్ స్కీమ్ (UPS).. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వబోతోంది. ఈ చర్య వారి సంక్షేమం.. సురక్షితమైన భవిష్యత్తు పట్ల మా ప్రభుత్వ…