పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు స్పెయిన్‌ను 2-1తో ఓడించింది. దీంతో.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది. కాగా.. విజయం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కాంస్య పతకం సాధించిన భారత జట్టుపై మోడీ గురువారం ప్రశంసలు కురిపించారు. ఈ ఘనత రాబోయే తరాలకు గుర్తుండిపోతుందని కొనియాడారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు.
ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు..
Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో గవర్నర్ల సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరయ్యారు
BC-OBC Reservations: సమగ్ర కుల గణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ పెంపును డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు దీక్షకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీలో బీసీ, ఓబీసీ విద్యార్థి నేతల నిరసన చేసేందుకు రెడీ అవుతున్నారు.
శనివారం 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు (ఐసీఏఈ)ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 65 ఏళ్ల తర్వాత భారత్‌లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డిజిటల్ వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను ఇందులో ప్రదర్శించనున్నారు.
Caste Row: లోక్‌సభ వేదికగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన ‘కులం’ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాహుల్ గాంధీని కులగణన డిమాండ్‌ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్‌తో పాటు దాని మిత్ర పక్షాలు బీజేపీని విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వ్యాఖ్యలు చేసిన అనురాగ్ ఠాకూర్‌కి ప్రధాని నరేంద్రమోడీ మద్దతుగా నిలిచారు.