Price Down: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ నెలలో 11 రకాల నిత్యావసరాల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వంట నూనెల దగ్గరి నుంచి ఉల్లిపాయల వరకు పలు వస్తువుల ధరలు దిగి వచ్చాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Ahmedabad: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ ఇప్పటికే దేశంలో ఐకానిక్‌గా నిలిచింది. సబర్మతి నదీ తీరంలో ఉండే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అహ్మదాబాద్‌కు మరింత వన్నె తచ్చింది. అయితే తాజాగా అహ్మదాబాద్‌లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రైల్వేస్టేషన్‌ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరల్డ్ క్లాస్ వసతులతో అలరారుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఈ మేరకు అహ్మదాబాద్‌లో నిర్మించనున్న వరల్డ్…
నూకల ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.. వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినా.. ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని స్పష్టం చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్‌లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, కేంద్రం తాజాగా నిర్ణయంపై సీరియస్‌గా స్పందించారు…
Union Minister of Commerce and Industry, Consumer Affairs, Food and Public Distribution, Textiles Piyush Goyal has been reappointed as a leader of the house in the Rajya Sabha.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఆ మీటింగులో.. ఒక జాతీయ పార్టీగా బీజేపీ సాధించింది ఏమీలేదని విమర్శించారు. తాను అడిగిన 9 ప్రశ్నల్లో ఒక్కదానికీ ప్రధాని మోడీ సమాధానం చెప్పలేదని తప్పుపట్టారు. దేశాన్ని బీజేపీ పట్టిపీడిస్తోందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు వాళ్లు చేసిందేమీ లేదని, వాళ్ల దగ్గర సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రూపాయి విలువ 80కి ఎందుకు పడిపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు.…
రాజ్యసభ ఎంపీగా కే. లక్ష్మణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.. ఈ సందర్భంగానే కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్శి సుదాన్ష్ పాండేను కలిశారు. వారితో తాను తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లర్ అసోసియేషన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసపూరిత విధానాల వల్ల వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భారతదేశం, తెలంగాణ అభివృద్ధిపై ఏమాత్రం చర్చించకపోవడం బాధాకరమని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ సమాజంపై ముప్పేట దాడి చేసేందుకు ఈ సమావేశాల్ని బీజేపీ వాడుకుందని ఆరోపించారు. తెలంగాణ పట్ల ప్రధానికి ఉన్న కక్ష తగ్గి, అభివృద్ధి పథకాలతో పాటు నిధులు ప్రకటిస్తారనుకున్నామని.. కానీ నిరాశే మిగిలిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే మోదీ పారిపోయారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా…
తెలంగాణ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పై కేంద్ర ఆహార, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ మండిపడ్డారు. ఢిల్లీలో నిన్న జరిగిన రాష్ట్రాల ఆహార శాఖ మంత్రుల సమావేశం, దేశంలో పౌష్టికాహార భద్రతపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు తెలంగాణ ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మంత్రులు గైర్హాజరు అయ్యారు. దీంతో.. ముఖ్యమైన సదస్సుకు సంబంధిత రాష్ట్రాల మంత్రులు హాజరు కాకపోవడంపై పీయుష్ గోయల్ అసంతృప్తి…