KTR: నూకల ఎగుమతిపై కేంద్రం నిషేధం.. అదే కారణమని కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నూకల ఎగుమతిపై నిషేధం విధించింది కేంద్రం.. ఎగుమతి పాలసీ సవరించిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు పేర్కొంది.. వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినా.. ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని స్పష్టం చేసింది.. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్‌లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, కేంద్రం తాజాగా నిర్ణయంపై సీరియస్‌గా స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతోనే దేశంలో ప్రస్తుతం ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది మండిపడ్డారు.. నరేంద్ర మోడీ సర్కార్ కు ముందుచూపు లేకపోవడంతో ప్రమాదంలో దేశ ఆహార భద్రత అని పేర్కొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత ఆలోచనలతో ఆహార ధాన్యాలను కొనకపోవడంతోనే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు.
Read Also: Ganesh Laddu Rs. 46 lakh: బాలాపూర్ గణేష్ రికార్డు బ్రేక్.. రూ.46 లక్షలు పలికిన గణపతి లడ్డూ..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ఇక, తెలంగాణ విఫలమైందని చూపే ప్రయత్నంలో నరేంద్ర మోడీ సర్కార్ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని ఆరోపించారు కేటీఆర్.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని ఆరు నెలల కిందట తాము కోరితే.. దేశంలో అవసరానికంటే ఎక్కువ ఆహార నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం తిరస్కరించిందని.. ప్రస్తుతం కొరతకు కారణమేంటో చెప్పాలంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను డిమాండ్ చేశారు. దేశంలో నాలుగేళ్ల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని చెప్పారు.. నాలుగేళ్లకు సరిపోయే గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని ఆరు నెలల క్రితం గొప్పగా చెప్పిన కేంద్ర సర్కార్.. తాజాగా బియ్యం ఎగుమతులను నియంత్రించి 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించిందని మండిపడ్డారు.. ఎఫ్‌సీఐ గోదాముల్లో, ఇతర కేంద్రాల్లో బియ్యం, నూకలు, గోధుమల నిల్వలు భారీగా తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఆహార ధాన్యాల కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే సేకరణ విధానం “వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్” అనుసరించాలని సూచించిన ఆయన.. తెలంగాణలో పుట్లకొద్దీ పండిన ధాన్యాన్ని కొనకుండా దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందన్నారు.. ఇప్పటికైనా దేశ ప్రజల ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!