తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్‌లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే…
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి కేంద్ర వైఖరిని టీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. మొన్న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టిన టీఆర్‌ఎస్. గురువారం రాష్ట్రంలో జాతీయ రహదారులను దిగ్భందించింది. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. వడ్ల కొనుగోలు పై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మంత్రి హరీష్ రావు…
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులకు ఈపరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రం, బీజేపీ ఓర్వలేకనే 2 సంవత్సరాల నుండే మోడీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది…
దేశవ్యాప్తంగా RRR సినిమా ప్రభంజనం నడుస్తోంది. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారు. భారతదేశ అతిపెద్ద సినిమా RRR సినిమా తొలి ఏడు రోజుల్లో రూ.750 కోట్లు వసూలు చేసినట్లు తాను తెలుసుకున్నానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందని.. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో భారత్ 418 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేసిందన్నారు. అంతేకాకుండా RRR సినిమా లాగే ఇండియన్…
తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా స్పందించారు. పంచాంగ పఠనం, ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశాడు కేసీఆర్ అన్నారు రేవంత్. కోడికి ధర తక్కువ.. మసాలాకే ధర ఎక్కువ అయ్యిందంటూ పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ నిజానికి 50 రూపాయలకే వస్తుంది. కానీ, కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు…
వరి యుద్ధం రసవత్తరంగా మారుతోంది. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మంత్రుల పర్యటన తర్వాత మరింత వేడెక్కాయి రాజకీయాలు. తెలంగాణ మంత్రులు ఢిల్లీ పోయి వడ్లు కొనమంటే నూకలు తినమని తెలంగాణ ప్రజలను బీజేపీ మంత్రి పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు. మనల్ని నూకలు తిను అనడం..యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే అన్నారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే ధరలు తగ్గుతాయి. నూకలు తినమని అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి…
బాయిల్డ్ రైస్ ఎవరూ ఉపయోగించరు. పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదు. ఆయా రాష్టాలు ఉత్పత్తి తగ్గించాయ్. 3400 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం 2014లో కేంద్రం ఖర్చు చేసింది. 26,600 కోట్లు గత ఏడాది ఖర్చు పెట్టాం. బాయిల్డ్ రైస్ వేర్ హౌజెస్ లో నిల్వ ఉంటున్నాయి.రా రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కోటా ఇంకా ఇవ్వలేదు.బాయిల్డ్ రైస్ కు ఆదరణ లేదు. హుజురాబాద్ ఎన్నికల తర్వాతే బాయిల్డ్ కొనాలనే అంశం…
కేసీఆర్ లొల్లి లేని దగ్గర లొల్లి చేస్తున్నాడు. బస్ ఛార్జ్ లు చెప్పకుండా పెంచారని మండిపడ్డారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరెంట్ ఛార్జ్ లు పెంచారు… ఛార్జ్ ల పెంపు ను డైవర్ట్ చేయడానికే ఢిల్లీకి మంత్రులను పంపించారన్నారు. ఓట్లు సీట్లు కొంటున్న కేసీఆర్ … ఇతర రాష్ట్రాల నేతలకు డబ్బులిచ్చి కొంటున్న సీఎం …ధాన్యం ఎందుకు కొనడం లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మంత్రులని ఢిల్లీకి కొట్లాటకు పంపించావా… సమస్య పరిష్కారం కోసం…
Minister Vemula Prashanth Reddy made comments on TS BJP Chief Bandi Sanjay. తెలంగాణలో ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ మంత్రులు ఢిల్లీకి వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో జరిగిన భేటీ అనంతరం తెలంగాణ మంత్రులు హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ… బండి సంజయ్ మెడకి…నాలుకకు లింక్ కట్ అయినట్టు ఉంది…