జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురం నుంచి గతంలోనే పోటీ చేయాలని చాలా మంది ఆహ్వానించారు.. కానీ, ఇప్పుడు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాన్నారు. 2019 లోనే పోటీ చేయమంటే నేను ఆలోచించాను.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే పిఠాపురం ప్రత్యేకమైనది అని ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురంలో కులాల ఐక్యత జరగాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెంఇన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో అధికార పార్టీ వైసీపీ అలర్ట్ అయ్యింది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ఎంపీ వంగా గీతకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. ఆ పిలుపు నేపథ్యం ఇన్ఛార్జ్ వంగా గీత హుటాహుటిన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.
తన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన దొరబాబు.. అప్పటి నుంచి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే పెండెం దొరబాబు.. ఆ తర్వాత సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.. అయితే, మరోసారి పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారా? ఆ దిశగా ప్రత్యామ్నాయ ఆప్షన్స్ పై దృష్టి పెట్టారా? అనే చర్చ సాగుతోంది..