Pawan Kalyan: పిఠాపురం పర్యటనకు పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఈ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ ప్రకటన తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటనకు సిద్ధం అవుతున్నారు.. వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.. నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెంఇన పార్టీ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్.. పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్ కల్యాణ్ వస్తుండడంతో.. అంతా ఆసక్తికరంగా మారింది.
Read Also: Lok Sabha Election 2024: ఎస్పీ తరఫున పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. రాజకీయ వర్గాల్లో కలకలం
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
ఇక, పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పెద్దసంఖ్యలో జనసేన పార్టీలో చేరతారని తెలుస్తోంది.. మరోవైపు.. సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారట.. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, పెండింగ్ లో ఉన్న పనులుపై దృష్టి సారించనున్న పవన్ కల్యాణ్.. వాటిపై ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఇక, గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు వచ్చాయట.. మొత్తంగా పవన్ కల్యాన్ తొలి పర్యటనలో కేవలం జనసేన నేతలతో సమావేశాలకే పరిమితం కానున్నారు.. ఆ తర్వాత పర్యటనలో కూటమిలోని మూడు పార్టీలు (జనసేన, టీడీపీ, బీజేపీ)నేతలు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారట పవన్ కల్యాణ్. కాగా, ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ముందుకు సాగుతున్నాయి.. ఇప్పటికే టీడీపీ-జనసేన ఉమ్మడిగా సభలు నిర్వహించగా.. నిన్న బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి సభ నిర్వహించాయి.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభకు హాజరైన విషయం విదితమే.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!