Vanga Geetha on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అని పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అన్నారు. పిఠాపురంను అప్రతిష్ట పాలు చేసే విధంగా పవన్ మాట్లాడవద్దన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి 25 ఏళ్లుగా తానేం చేశానో ప్రజలకు తెలుసని వంగా గీత పేర్కొన్నారు. 2024 శాసనసభ ఎన్నికలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వంగా గీతలు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. దాంతో ఎన్నికల వేళ పిఠాపురంలో రాజకీయాలు…
పిఠాపురంలో పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదని.. సమస్యలు నావి అనుకున్నాను తప్ప నియోజకవర్గం గురించి ఆలోచించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురంలో లక్ష మెజారిటీ గెలిపిస్తా అన్నారని.. ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.
ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని జనసేన ప్రకటించింది. వారాహి వాహనం నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం మొదలు పెడతారని తెలిపింది. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టనున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో.. పవన్ ఎన్నికల ప్రచారంపై జనసేన కసరత్తు ప్రారంభించింది. శక్తిపీఠం కొలువైన క్షేత్రం.. శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచే ప్రచారం మొదలుపెట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. పురుహూతిక దేవికి పూజలు నిర్వహించి వారాహి…