Pawan Kalyan: పిఠాపురంలో ప్రచారానికి సిద్ధమైన జనసేనాని.. అభ్యర్థిగా తొలిసారి పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి తాను ఎన్నికల బరిలోకి దిగుతోన్న పిఠాపురంలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపటి నుంచి మూడు రోజుల పాటు జనసేనాని పిఠాపురంలో పర్యటించబోతున్నారు.. తొలి రోజు శ్రీ పురుహూతిక దేవి అమ్మవారి ఆలచాన్ని దర్శించుకోనున్నారు పవన్.. అక్కడే వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఇక, తన పర్యటనలో భాగంగా తొలిరోజు బషీర్ బీబీ దర్గా దర్శనం, క్రైస్తవ మత పెద్దలతో ప్రత్యేక ప్రార్థనల్లోనూ పాల్గొనబోతున్నారు.. తొలిరోజు సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్నారు పవన్ కల్యాణ్.. తాను పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని వస్తుండడంతో.. పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధం అవుతున్నారు ఆ పార్టీ శ్రేణులు..
Read Also: Couple Arrested: వృద్ధ అమ్మమ్మపై దాడి చేసిన దంపతులను కటకటపాలు చేసిన పోలీసులు..!
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఇక, ఇప్పటికే వారాహి వాహనాన్ని పిఠాపురం నియోజకవర్గానికి తరలించారు. ఈ నెల 30 నుంచి మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్.. కూటమి నేతలతో సమీక్ష నిర్వహిస్తారు.. జనసేనలో చేరికలు కూడా భారీగా ఉంటాయని తెలుస్తోంది.. నియోజకవర్గంలోని మేధావులు, వివిధ వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.. ఈ మూడు రోజులు పవన్ పిఠాపురంలోనే బస చేయనున్నారు. ఈ పర్యటనలో కూటమి నేతల ఇళ్లకు వెళ్లనున్నారు పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్‌కల్యాణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నారు. మరోవైపు.. వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఆమె కూడా కాపు సామాజికవర్గం నేత కావడంతో తమకు కలిసివస్తుందనే భావనలో వైసీపీ ఉంది.. ఇక, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇటీవలే వైసీపీలో చేరగా.. ఆయనకు పిఠాపురం బాధ్యతలు అప్పగించారు సీఎం వైఎస్ జగన్.. దీంతో ముద్రగడ వరుసగా పిఠాపురంలో కాపునేతలతో సమావేశాలు అవుతూ వస్తున్నారు.. మొత్తంగా పిఠాపురంలో పోరు ఆసక్తికరంగా సాగుతోంది.
తాజావార్తలు
-
TGSRTC : దసరా జర్నీకి టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!